థియేటర్స్‌లో రోజుకు వన్ ఆర్ టూ మూవీస్ చూడొచ్చు. అదే ఓటీటీ అయితే మనకు నచ్చినప్పుడు.. మనకు నచ్చిన సమయంలో నచ్చిన విధంగా సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. అలా ఈ వారం ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తున్నాయి తెలుగు స్ట్రైట్ అండ్ డబ్బింగ్ వర్షన్ చిత్రాలు.
శంభాల : ఆది సాయి కుమార్ చాన్నాళ్ల తర్వాత కంబ్యాక్ అయిన శంభాల ఓటీటీలోకి వచ్చేసింది. గత ఏడాది క్రిస్మస్‌కు రిలీజై సాలిడ్ హిట్ అందుకున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఆహాలో అందులోబాటులోకి వచ్చేసింది.
చీకటిలో : నాగ చైతన్యను వివాహం చేసుకున్నాక యాక్టింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఓటీటీ ఫిల్మ్ చీకటిలోతో హాయ్ చెప్పింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
మార్క్ : క్రిస్మస్‌కు కన్నడ ఆడియన్స్ ముందుకు పోటా పోటీగా వచ్చాయి కిచ్చా సుదీప్ యాక్షన్ ఎంటర్టైనర్స్ మార్క్ , శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి మల్టీస్టారర్ 45. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా సక్సెస్ కాలేదు. మార్క్ జియో హాట్ స్టార్‌లో, 45 జీ5లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
తేరీ ఇష్క్ మే : ఆనంద్ ఎల్ రాయ్- ధనుష్ కాంబోలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా తేరీ ఇష్క్ మే రిలీజైన నెలన్నర తర్వాత ఓటీటీ బాట పట్టింది. నెట్ ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అవుతోంది. ఇక ఇదే సినిమాతో పోటీపడిన రొమాంటిక్ డ్రామా గుస్తాక్ ఇష్క్ కూడా జియో హాట్ స్టార్‌లోకి వచ్చేసింది.
సిరాయ్ : విక్రమ్ ప్రభు నటించిన క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా సిరాయ్. ఏ మాత్రం అంచనాలు లేకుండా క్రిస్మస్‌కు వచ్చిన ఈ ఫిల్మ్ రూ. 30 కోట్లను రాబట్టుకుంది. ఇప్పుడు జీ5లోకి వచ్చేసింది
ఇక వెబ్ సిరీస్‌ల విషయానికి వస్తే.. తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ బయోగ్రాఫికల్ డ్రామా వెబ్ సిరీస్ స్పేస్ జెన్ : చంద్రయాన్ జియో హాట్ స్టార్‌లో.. బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కాళీ పొట్కా జీ5లో సందడి చేస్తున్నాయి. వీటితో పాటు ఇటాలియన్ మూవీస్ లా గ్రేజియా- ముబీలో, క్రైమ్ థ్రిల్లర్ డ్రామా ది బిగ్ ఫేక్, ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ఫిల్మ్ స్కై స్రాపర్ లైవ్ – నెట్ ఫ్లిక్స్‌లో, సైన్ ఫిక్షన్ ఆఫ్టర్ బర్న్… లయన్స్‌గేట్‌ప్లేలో స్ట్రీమింగ్ అవుతున్నాయి
