Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ సూరజ్ నంబియార్ జోడీ సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించేవారు. అయితే, తాజాగా వీరిద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో విడాకుల వార్తలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల మధ్య విభేదాలు వస్తే మొదట సోషల్ మీడియాలోనే అవి బయటపడుతుంటాయి, అందుకే అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నప్పటికీ, వీరిద్దరి ప్రొఫైల్స్‌లో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పాత రొమాంటిక్ పోస్ట్‌లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇది కేవలం చిన్నపాటి మనస్పర్థల వల్ల జరిగిన అన్ఫాలోనా లేదా విడాకుల వైపు అడుగులేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. 2022 జనవరిలో గోవా వేదికగా మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన నాలుగేళ్లకే ఇలాంటి వార్తలు రావడం పట్ల నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ ప్రచారంపై మౌనీ కానీ, సూరజ్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
ఇక వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, మౌనీ రాయ్ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీగా ఉన్నారు. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో మౌనీ కీలక పాత్ర పోషిస్తున్నారు. పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. వ్యక్తిగత ఒడిదొడుకులను పక్కన పెట్టి మౌనీ తన సినిమాల ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?