Disha-Mouni: లెస్బియన్ రూమర్స్‌కు చెక్ పెట్టాలనుకున్న మౌనీ రాయ్.. కానీ రివర్స్ అయిందే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దిశా పటానీ (Disha Patani), మౌనీ రాయ్ (Mouni Roy) ల మధ్య ఉన్న స్నేహం గురించి బీ-టౌన్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. గత కొంతకాలంగా ఈ ఇద్దరు భామలు రిలేషన్లో ఉన్నారని, వీరు ‘లెస్బియన్స్’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చాయి.
వీరిద్దరూ తరచూ కలిసి విదేశీ వెకేషన్లకు వెళ్లడం, పార్టీలలో అత్యంత క్లోజ్‌గా దిగిన ఫొటోలను షేర్ చేయడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే, తాజాగా మౌనీ రాయ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన ఒక క్రేజీ పోస్ట్.. ఆ తర్వాత దానిని డిలీట్ చేయడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టా స్టోరీ లేదా పోస్ట్‌లో దిశా పటానీతో కలిసి ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫొటోను షేర్ చేశారు.. ఆ ఫొటోకు మౌనీ రాయ్.. ‘నా లిటిల్ సిస్టర్ను చాలా మిస్సవుతున్నాను’ అంటూ ఒక లవ్లీ క్యాప్షన్ పెట్టారు.. ఈ పోస్ట్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం.. తామిద్దరం కేవలం అక్కాచెల్లెళ్ల లాంటి బంధాన్ని, మంచి స్నేహాన్ని మాత్రమే పంచుకుంటున్నామని ప్రపంచానికి చాటి చెప్పడమేనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తద్వారా తమపై వస్తున్న అసత్య ప్రచారాలకు, లెస్బియన్ రూమర్స్‌కు ఆమె చెక్ పెట్టాలని భావించినట్లు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
Also Read
- Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన 'హాయ్'!
- TV Nandi Awards: తిరుపతి వేదికగా 'నంది' అవార్డుల వేడుక.. పరభాషా నటులపై ఆంక్షలు?
- Mamitha Baiju : మమితా బైజు కోరిక తీరేదెన్నడు?
ఆ ఫొటోను పోస్ట్ చేసిన కాసేపటికే మౌనీ రాయ్ మరేదో కారణం చేత దానిని తన ఇన్స్టాగ్రామ్ పేజీ నుండి హఠాత్తుగా డిలీట్ చేసేశారు. మౌనీ రాయ్ ఆ ఫొటోను ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? అనేదానిపై ఇప్పుడు నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. పోస్ట్ కింద నెగిటివ్ కామెంట్లు రావడం వల్లే డిలీట్ చేసిందా? లేదా పొరపాటున ఆ క్యాప్షన్ పెట్టాననే ఉద్దేశంతో తీసేసిందా? అంటూ బాలీవుడ్ సర్కిల్స్‌లో సరికొత్త డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఏదేమైనా, ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ ఎంతగా క్లారిటీ ఇస్తున్నా.. సోషల్ మీడియా రూమరాయుళ్లు మాత్రం వీరిపై వార్తలు అల్లడం ఆపడం లేదు.
తాజావార్తలు
-
Iran Ceasefire Proposal: ఇరాన్ శాంతి ప్రతిపాదనకు ట్రంప్ నో.. 7 రోజుల కాల్పుల విరమణ ప్లాన్ తిరస్కరణ
-
Shubman Gill Injury: సిరాజ్ దెబ్బకు శుభ్‌మన్ గిల్ విలవిలా.. నెట్స్ లో గాయపడ్డ టీమిండియా కెప్టెన్.!
-
Vikarabad: గణేష్ నిమజ్జనంలో కలకలం.. పోలీస్ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి..!
-
iQOO 16: iQOO 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లే!
-
Oman Cricket: ఇదేం విచిత్రం రా మావా..! టీమ్‌లో తొమ్మిది మంది ఒకే కుటుంబానికి చెందిన ప్లేయర్స్..
ట్రెండింగ్
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!