Site icon NTV Telugu

మొత్తానికి, హైదరాబాద్ లోనే ఇల్లు కొనేసిన మోనాల్

గుజ‌రాతీ గ్లామర్ బ్యూటీ మోనాల్ గజ్జర్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా అవకాశాలు, వెబ్ సిరీస్, టీవీ షోలు బాగానే ఉండటంతో హైదరాబాద్ లోనే వుంటుంది. ఈ బ్యూటీ గ్లామరస్ ఫోటోషూట్స్ తోను బిజీగా మారింది. అయితే మోనాల్ హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వాలని వున్నట్లుగా గతంలోనే స్టేట్మెంట్స్ ఇచ్చింది. ఇప్పుడు తన కల నెరవేరిందంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మొత్తానికి హైదరాబాద్ లో ఇల్లు కొనేసాను. ఇప్పుడు నేను ఆఫీసియల్లీ హైదరాబాదీ’ అంటూ పేర్కొంది. హైద‌రాబాద్‌లో షూటింగ్ అంటే అహ్మ‌దాబాద్ నుంచి రావడానికి ఇబ్బందిగా ఉండేదని తెలిపింది. కానీ, ఇప్పుడు నా ఫ్యామిలీతో క‌లిసి ఇక్క‌డే ఉండ‌బోతున్నాను. ఇదొక ఎమోష‌న‌ల్ మూమెంట్‌ అని మోనాల్ తెలిపింది.

Exit mobile version