మలయాళం అంటే ఒకప్పుడు మల్లు సినిమాలకు పెట్టింది పేరు. ఒకానొక టైమ్ లో మల్లు కంటెంట్ సినిమాలు వస్తున్నాయి అంటే స్టార్ హీరోల సినెమాలు కూడా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. కానీ అదంతా ఇప్పుడు గతం. ఇప్పుడు మలయాళం సినిమా అంటే కథ, కథనాలాతో సినిమా స్టాండర్డ్స్ ను పెంచుతున్న ఇండస్ట్రీ. లాక్ డౌన్ కారణంగా మలయాళ సినిమా మ్యాజిక్ ఏపాటిదో తెలిసింది. దాంతో మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్, డబ్బింగ్ చేసారు.
Also Read : Vijay 69: బాలయ్య సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయనున్న విజయ్..?
so ఓటీటీ సంస్థలు ఇటీవల రిలీజ్ అవుతున్న చిన్న,పెద్ద సినిమాలను కొనుగోలు చేసి పాన్ ఇండియా భాషలలో స్ట్రీమింగ్ కు తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో మలయాళ సినిమాల నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి మలయాళ సినిమాలను రిలీజ్ కు ముందు ఓటీటీ రైట్స్ అమ్మకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ మధ్య కాలంలో మళయాలంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు ఓటీటీ లలో రికార్డు స్థాయి వ్యూస్ వస్తున్నాయి. రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ రూపంలో ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ తక్కువలో దక్కించుకుని ఓటీటీ సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. నిర్మాతలకు కొంత మొత్తం మాత్రమే చెల్లిస్తున్నాయి. దింతో రాబోయే సినిమాల విషయంలో నిర్మాతలు ఇక రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ ను అమ్మకుండా రిలీజ్ చేసి తర్వాత అమ్మకాలు చేయాలనీ ఒక నిర్ణయానికి వచ్చారు. 2025 లో రిలీజ్ కానున్న సినిమాలకు ఈ విధమైన రూల్ పాటించాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ విధమైన ఆలోచన ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.