Site icon NTV Telugu

Mollywood : డ్రగ్స్ దుమారంపై.. మలయాళ పరిశ్రమ కీలక నిర్ణయం

Mollywood Drug Controversy

Mollywood Drug Controversy

మాదకద్రవ్యాల వాడకం ఆరోపణలతో.. గత కొంతకాలంగా మలయాళ చిత్ర పరిశ్రమ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. పేరు పొందిన నటులు సైతం షూటింగ్ సెట్స్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారని పలువురు నటీమణులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు మలయాళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : Kubera : ‘కుబేర’ తో ఎన్నాళ్లకు హౌస్‌ఫుల్ బోర్డులు.. మళ్లీ జోష్‌లో ఇండస్ట్రీ

నటీనటులు ఎవరైనా ప్రాజెక్టు ఓకే చెప్పినప్పుడు వారు తప్పకుండా సెట్‌ల్లో డ్రగ్స్ ఉపయోగించము అనే ఒక కొత్త అఫిడవిట్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. నటీనటులతో పాటు వారి సిబ్బంది.. చివరకు డ్రైవర్ కూడా ఇందులో భాగమే. వారందరూ సంతకాలు చేస్తేనే సెట్ లోకి అడుగు పెట్టగలుగుతారు. ఈ మేరకు మలయాళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. షూటింగ్ లొకేషన్ తో పాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది వర్తిస్తుంది. సూపర్ స్టార్స్ నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్ వరకు ఎవరూ దీనికి అతీతులు కారు. నిర్మాతల అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయం పై అన్ని విభాగాల వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మరోవైపు, ఆదివారం ‘అమ్మ’ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version