ఈ ఏడాది మాలీవుడ్ నెవ్వర్ బిఫోర్ హైస్ చూసింది. కంటెంట్, కాన్సెప్ట్‌కు వంక పెట్టలేని చిత్రాలను కంటిన్యూ చేసిన మాలీవుడ్.. ఆ కష్టానికి ప్రతి ఫలం పుచ్చుకుంది. మునుపెన్నడి లేనివిధంగా రూ.300 కోట్ల మార్క్ రీచ్ చూసింది. సూపర్ ఉమెన్ స్టోరీ ‘లోక చాప్టర్ 1: చంద్ర’ ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ఇదే ఏడాది వచ్చిన మోహన్ లాల్ ‘ఎంపురన్’ పేరిట ఉన్న ఆల్ టైం రికార్డ్‌ను లోకతో తుడిపేసి.. తన పేరు లిఖించింది కళ్యాణి ప్రియదర్శన్.
ఎంపురన్ మాత్రమే కాదు.. ఈ ఏడాది హ్యాట్రిక్ హిట్స్.. అందులోనూ రూ.200 ప్లస్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు లాలెట్టన్. లూసిఫర్, తుడరుమ్ చిత్రాలు రూ.200 కోట్లను క్రాస్ చేస్తే.. హృదయ పూర్వం రూ.100 కోట్లకు రీచైంది. ఇక చివరిలో వచ్చిన ‘వృషభ’ తేడా కొట్టింది. లేకుంటే 2025 కంప్లీట్‌గా కంప్లీట్ స్టార్ దే అయ్యేది. మరో స్టార్ హీరో మమ్ముట్టి డొమినిక్ ది లేడీస్ పర్స్, భజూక ఫ్లాప్స్ చూసినా.. కళంకావల్‌తో గట్టెక్కారు. ఈ సీనియర్లే కాదు యంగ్ హీరోలు సత్తా చాటారు.
‘ప్రేమలు’తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన సస్లేన్ అలప్పుజా జింఖానా.. లోకతో డబుల్ హిట్స్ అందుకున్నాడు. ప్రణవ్ మోహన్ లాల్ డీఈస్ ఇరే నియర్లీ రూ.80 కోట్లు వసూలు చేసి సక్సెస్ జాబితాలోకి చేరింది. ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్ నటించిన రేఖా చిత్రం, అనుపమ పరమేశ్వరన్ పెట్ డిటెక్టివ్, రోషన్ మాధ్యూ రోంత్, పదక్కలం, అర్జున్ అశోకన్ సుమతి వలవు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, దిలీప్ ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, ఏకోతో పాటు చివరిలో సర్వం మాయతో కంబ్యాక్ అయ్యాడు నివిన్ పౌలీ. బాసిల్ జోసెఫ్ పొన్మన్, మరణమాస్, దిలీప్ భా భా బ, టొవినో నరివెట్ట చిత్రాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.
