Site icon NTV Telugu

Mokshagna : వారెవ్వా.. మోక్షజ్ఞ.. లుక్ అదిరింది అబ్బాయ్

Mokshagna

Mokshagna

గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఙను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు. అందుకే సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైమ్ లో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. దాదాపు ఏడాదిగా ఈ సినిమాను అలా పక్కన పెట్టేసారు.

Also Read : Exclusive : నాని నెక్ట్స్ సినిమా ఆ యంగ్ డైరెక్టర్ తోనే.. నో ఛేంజెస్

ఇక మోక్షు కూడా ఇటీవల కాలంలో బయట ఎక్కడ కనిపించలేదు. అసలు మోక్షు సినిమాల్లోకి వస్తాడా లేదా అని అనుమానం కూడా కలిగింది. అయితే మోక్షు సినీ ఎంట్రీ అనేది తప్పకుండా ఉండబోతుంది. అందుకు తగ్గట్టే తన లుక్ ను కూడా మైంటైన్ చేస్తున్నాడు ఈ యంగ్ లయన్. చాలా రోజుల తర్వాత మోక్షు ఫ్యామిలీ ఫంక్షన్ లో దర్శనమిచ్చాడు. తండ్రికి తగ్గ కొడుకులాగా సూపర్ కూల్ లుక్ లో మాస్ అప్పీల్ తో సూపర్ గా ఉన్నాడు మోక్షు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి నటసింహం వారసుడు సింబా త్వరలోనే వెండితెర అరంగ్రేటం కోసం ఎదురుచూస్తున్నామని నందమూరి అభిమానూలు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య వారసుడి ఎంట్రీ ఎప్పుడైనా సరే తొలి సినిమాతో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయబోతున్నాడు. బి బహుశా ఆ సినిమాతో మోక్షు టాలీవుడ్ ఎంట్రీ ఉండొచ్చు.

Exit mobile version