Site icon NTV Telugu

Mohanlal : మీరు మోహన్ లాల్ ఇంట్లో ఉండచ్చు.. ఎలానో తెలుసా?

Mohan Lal

Mohan Lal

మలయాళ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న మోహన్‌లాల్, మమ్ముట్టి ఇద్దరూ తమ నటనా ప్రతిభతో, వ్యక్తిత్వంతో దశాబ్దాలుగా ప్రేక్షక హృదయాలను ఆకట్టుకుంటున్నారు. మోహన్‌లాల్ వయసు 65 సంవత్సరాలు, మమ్ముట్టి వయసు 73 సంవత్సరాలు అయినప్పటికీ, వీరిద్దరి ఉత్సాహం, చురుకుదనం చూస్తే యవ్వనంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమాల్లో నటిస్తూ, కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ, వారు ఇప్పటికీ సినీ పరిశ్రమలో స్టార్ లుగా నిలుస్తున్నారు. ఇటీవల వీరిద్దరి సినీ ప్రయాణంతో పాటు వ్యాపారంలో కూడా దూసుకుపోతున్నారు. మోహన్‌లాల్ ఊటీలోని గెస్ట్‌హౌస్, మమ్ముట్టి కొచ్చిలోని అతిథి గృహం రెండూ వారి అభిమానులకు, పర్యాటకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తున్నాయి.

Also Read:Nagarjuna: ఈ పాత్ర ఎలా ఒప్పుకున్నావ్ నాగ్?

ఈ గెస్ట్‌హౌస్‌లు కేవలం వసతి సౌకర్యాలను అందించడమే కాకుండా, ఈ సూపర్‌స్టార్ల జీవనశైలిని, వారి వ్యక్తిగత ఆసక్తులను సమీపంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. మోహన్‌లాల్ ఊటీలోని లగ్జరీ గెస్ట్‌హౌస్‌ను ఇటీవల అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఈ గెస్ట్‌హౌస్‌లో మూడు బెడ్‌రూమ్‌లు, అత్యాధునిక సౌకర్యాలు, పెయింటింగ్ గ్యాలరీ, మరైకాయర్ సినిమాలో ఉపయోగించిన డమ్మీ గన్‌ల ప్రదర్శన వంటి ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో ఒక రోజు బసకు 37 వేల రూపాయల అద్దె నిర్ణయించారు. అంతేకాకుండా, మోహన్‌లాల్ ఊటీకి వచ్చినప్పుడు తనకు రుచికరమైన వంటలు వండే చెఫ్‌ను ఈ గెస్ట్‌హౌస్‌లో బస చేసే పర్యాటకుల కోసం నియమించారు. ఈ వినూతన ఆలోచనతో ఊటీలోని మోహన్‌లాల్ గెస్ట్‌హౌస్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.

Exit mobile version