మలయాళ సినిమా సెట్స్ క్యారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలతో నటీమణులను చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సినీ నటి రాధికా శరత్‌కుమార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె కామెంట్స్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వార్తల తర్వాత, మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసి సమాచారం కోరినట్లు రాధిక చెబుతోంది. చెన్నైలో జరిగిన కొత్త సీరియల్‌కి సంబంధించిన విలేకరుల సమావేశంలో రాధికా శరత్‌కుమార్ ఈ మేరకు కామెంట్ చేశారు. మోహన్‌లాల్ ఫోన్ చేశారని చెప్పారు. మోహన్‌లాల్ సార్ నాకు ఫోన్ చేసి నా సెట్‌లో ఇలా జరిగిందా అని అడిగారు. సార్.. పేరు చెప్పకూడదని చెప్పాను.
Devara : ‘దేవర’ దావుడి.. చికెన్ ఫ్రై, బిర్యాని..పోతారు.. అంతా పోతారు!!
మీ సెట్‌లో గానీ, ఎవరి సెట్‌లో గానీ అది జరిగింది. కానీ అది ఎవరి సెట్ అనేది బయటపెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను’’ అని రాధికా శరత్‌కుమార్ మీడియాకు తెలిపారు. తమిళ సినిమాలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కూడా రాధిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమిళ సినిమా టాప్ స్టార్ యువ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె అన్నారు. ‘‘యువ నటిపై దాడి జరిగింది.. అప్పుడు నటుడు మద్యం మత్తులో ఉన్నాడు.. దీంతో ఆ నటుడిపై గట్టిగా అరిచా, తర్వాత ఆ అమ్మాయి నన్ను కౌగిలించుకుని నువ్వే కాపాడావు అని అన్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఆమె మాట్లాడిన భాష అర్ధం కాలేదు. ఇక ఆ అమ్మాయి ఇప్పటికీ నాకు మంచి స్నేహితురాలు అని రాధిక అన్నారు. రాజకీయ అజెండా ఉన్న నటీనటులు ముందుగా తమ సినీ పరిశ్రమలోని మహిళలకు రక్షణ కల్పించాలని రాధిక అన్నారు.