Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. తన విలక్షణ నటనతో, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు (80) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. గిరిబాబు మరణంపై డైలాగ్ కింగ్, పద్మశ్రీ డా. మంచు మోహన్ బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆప్తమిత్రుడిని కోల్పోయిన బాధలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మద్రాస్‌లో తాము సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజులను గుర్తుచేసుకుంటూ మోహన్ బాబు భావోద్వేగానికి గురయ్యారు.
గిరిబాబుతో తనకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ.. “మద్రాస్‌లో ఉన్న రోజుల్లో గిరిబాబు, నేను ఒకే గదిలో ఉండేవాళ్లం (రూమ్మేట్స్). మా ఇద్దరి మధ్య అంతటి గాఢమైన స్నేహం ఉండేది. సినీ పరిశ్రమలో నాకంటే ముందే ఆయన నటుడిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత మేమిద్దరం ఎన్నో సినిమాల్లో కలిసి నటించాం, ఒకరి చిత్రాల్లో మరొకరం భాగమయ్యాం” అని మోహన్ బాబు తెలిపారు. గిరిబాబు కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో మరపురాని విజయాలను అందుకున్నారని మోహన్ బాబు కొనియాడారు. “ఆయన ఎంతో గొప్ప మనసున్న మనిషి. ఎలాంటి పాత్రనైనా తనదైన శైలిలో రక్తి కట్టించే విలక్షణ నటుడు. అలాంటి వ్యక్తి నేడు మన మధ్య లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. బాధతో నాకు మాటలు కూడా రావడం లేదు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను” అంటూ మోహన్ బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. గిరిబాబు భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒక మంచి నటుడినే కాకుండా, పరిశ్రమకు పెద్దదిక్కుగా ఉన్న వ్యక్తిని కోల్పోయామని సినీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Also Read
- Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
- Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
- #AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
- NTRxAnilRavipudi: అసలు ఎవరూ ఊహించని కాంబో.. అనిల్ రావిపూడితో ఎన్టీఆర్ నవ్వుల జాతర!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!