NTV Telugu Site icon

Mohan Babu: హాస్పిటల్ కు మోహన్ బాబు దంపతులు.. క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధుల ధర్నా!!!

Manchu Mohan Babu

Manchu Mohan Babu

మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంచు మనోజ్ డీజీపీ ఆఫీస్ కి వెళ్లి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలాసేపు వేచి ఉన్న తర్వాత తనకోసం వచ్చిన బౌన్సర్లను తీసుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ మంచు మనోజ్ గేటు తోసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. మంచు మనోజ్ వెళ్లిన తర్వాత ఆయనకు మద్దతుగా మీడియాను కూడా రమ్మని కోరడం జరిగినట్లుగా తెలుస్తోంది. వెంటనే మీడియా ప్రతినిధులు కూడా మైకులు కెమెరాలు తీసుకుని మనోజ్ వెంట వెళ్లారు. మనోజ్ లోపలికి వెళ్ళిన వెంటనే మోహన్ బాబు సహా ఆయనతో పాటు ఉన్న బౌన్సర్లు కొంతమంది అనుచరులు మనోజ్ మీద దాడి చేశారు.

AI Caught Thiefs: దొంగలను పట్టించిన ఏఐ.. 1.5 కిలోల బంగారం, 2 కిలోల వెండి, రూ. 17 లక్షల నగదు స్వాధీనం

వాటిని షూట్ చేస్తున్న కెమెరాలకు సైతం మంచు మోహన్ బాబు అడ్డం పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఒక మైక్ తీసుకుని అయ్యప్ప మాలధారణ చేసిన ఒక ఛానల్ రిపోర్టర్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా అవుతూ ఉండగానే వారిని బయటికి తోసివేసి గేట్లు బిగించారు. అనంతరం వెంటనే మోహన్ బాబు కాలికి గాయమైందని తన తల్లికి అస్వస్థత ఏర్పడిందని చెబుతూ మంచు విష్ణు తన తల్లిదండ్రులు ఇద్దరినీ తీసుకుని కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్లారు .ఇక మోహన్ బాబు మీడియాకి క్షమాపణలు చెప్పాలంటూ మీడియా ప్రతినిధులు అక్కడ బైటాయించారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మోహన్ బాబు ఇలా మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదంటూ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రస్థాయిలో ఖండించింది.

Show comments