హారర్ కామెడీగా ‘శ్రీ లక్ష్మీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్ ను టార్గెట్ చేస్తూ శ్రీ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ‘బోయ్స్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్ర కథానాయిక మిత్రా శర్మనే దానిని నిర్మిస్తున్నారు. ఇప్పుడీమె మరో సినిమాను కూడా మొదలెట్టబోతున్నారు. శశి హస్ చెప్పిన హారర్ కామెడీ సబ్జెక్ట్ నచ్చడంతో అతన్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మూవీని మొదలెట్ట బోతున్నామని మిత్రా శర్మ తెలిపారు. ఈ రెండో సినిమాకు ‘శ్రీ లక్ష్మీ’ అనే పేరు పెట్టారు. ది ఘోస్ట్ హంటర్ అనేది ట్యాగ్ లైన్. తొలి చిత్రాన్ని కూడా తాను కొత్త దర్శకుడితోనే తీస్తున్నానని, ఇప్పుడీ సినిమాతోనూ డెబ్యూ డైరెక్టర్ ను పరిచయం చేస్తున్నానని నిర్మాత మిత్రా శర్మ చెప్పారు. కథ, కథనం బాగుంటే కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులను తెలుగువారు ప్రోత్సాహిస్తారనే నమ్మకం తనకుందని ఆమె చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్యాండమిక్ సిట్యుయేషన్ తగ్గగానే ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళతామని అన్నారు. ‘శ్రీ లక్ష్మీ’ చిత్రానికి పడవల బాలచంద్ర సహ నిర్మాత కాగా, మార్తండ్ కె వెంకటేశ్ ఎడిటర్, వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్, స్మరణ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
- Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! 'భాయ్‌జాన్'కు ఏమైంది?
- Yadhu Vamsi: 'నా కొడుకు సాధించాడు'.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
- Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
తాజావార్తలు
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!