Site icon NTV Telugu

Mirzapur : సినిమాగా వస్తున్న మీర్జాపూర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Mirapur

Mirapur

మీర్జాపూర్‌ భాషలతో సంబంధం లేకుండా ఓటీటీలో సూపర్ హిట్ గా నిలిచినా వెబ్‌సిరీస్‌. క్రైమ్‌ యాక్షన్‌ జానర్‌లో వచ్చిన ఈ సిరీస్‌ రెండు సీజన్లు యువతను విశేషంగా అలరించాయి. మరి ముఖ్యంగా యూత్ ను విశేషంగా అలరించింది మీర్జాపూర్.దివ్వేందు నటించిన మున్నా భయ్యా పాత్ర సిరీస్ మొత్తంలో హైలెట్ గా నిలిచింది. గుర్మీత్ సింగ్ మరియు ఆనంద్ అయ్యర్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ మిలియన్ వ్యూస్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్ వెబ్ సిరీస్ లో అగ్ర స్థానం అందుకుంది.

Also Read : Hyderabad : నగరంలో 144 సెక్షన్.. పుష్ప – 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లేనట్టేనా..?

తాజగా ఈ సిరీస్ గురించి మరొక సెన్సషన్ అప్ డేట్ అందించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో మూడు సీజన్స్ గా వచ్చిన మీర్జాపూర్ సిరీస్ ను ఇప్పుడు ఏకంగా మూడు గంటల సినిమాగా తీసుకురాబోతున్నారు. Amazon MGM స్టూడియోస్ మరియు ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. పునీత్ కృష్ణ కథ రచన చేస్తుండగా గుర్మీత్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్న మున్నా భయ్యా మరోసారి తిరిగిరానున్నారు. మూడు సీజన్స్ లీడ్ రోల్స్ లో నటించిన పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్ మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.  ఈ సినిమాను 2026 క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు  మేకర్స్.

Exit mobile version