Site icon NTV Telugu

Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Mirai

Mirai

యంగ్ హీరో తేజ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ.. ‘హనుమాన్’ సినిమాతో 100 కోట్లు కొల్లగొట్టాడు. ప్రజంట్ తేజ సజ్జా చేస్తున్న రెండవ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Also Read : Papaya Side Effects: ఈ 5 సమస్యలున్నవారు బొప్పాయి తినకూడదు

మంచు మనోజ్ శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో, తేజ సూపర్ పవర్స్ కలిగిన ఒక యోధుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ లో తేజ యాక్షన్, విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకోగా.. మానవ జాతి భవిష్యత్తును నిర్ణయించే తొమ్మిది గ్రంథాలను కాపాడే యోధుడిగా ఆకట్టుకున్నాడు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఆసక్తికరంగా ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్థమైంది. ఇక తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో పాటు ఇతర దేశీయ భాషల్లోనూ విడుదల కానుందని తెలపారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన పవర్ ఫుల్ ట్రైలర్ ఆగస్ట్ 28న రాబోతున్నట్లు కూడా కన్ఫర్మ్ చేశారు.

 

Exit mobile version