యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ . సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందింది. మంచు మనోజ్, శ్రియ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ విడుదలకు కరణ్ జోహార్ బాధ్యత వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ..
Also Read : Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్..
“తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రాజమౌళి సర్, ప్రభాస్ గారు, తారక్, చరణ్ అన్నీ విదాలుగా శ్రమించారు. వాళ్లు విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసారు. ఇప్పుడు మేమంతా వాళ్ళు వేసిన దారిలో సులభంగా మా సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాం. తదుపరి రాజమౌళి సర్ SSMB 29, రిషబ్ శెట్టి కాంతార2, ప్రభాస్ కల్కి2 వంటి చిత్రాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతాయి.ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఇది అందరూ చెప్పేదే. కానీ, చెప్పక తప్పదు. కొన్ని పరిమితులు, ఇబ్బందులు ఉన్నా మా కలలు మాత్రం చిన్నవి కావు. ఇండియా బిగ్గెస్ట్ మూవీగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డాం. నిర్మాత విశ్వప్రసాద్ మమ్మల్ని ఎంతో నమ్మి కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఎమోషనల్‌గానూ ఎంతో సహకరించారు. ఈ మూవీని హిందీలో తీసుకొస్తున్న కరణ్ సర్‌కి ధన్యవాదాలు. హిందీ ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. మీరు మెచ్చే మరిన్ని చిత్రాలు తీసుకొస్తాం’ అని తెలిపారు..
