Site icon NTV Telugu

Mirai : మిరాయ్ మాస్ ఎంట్రీ షురూ.. యూత్‌ఫుల్ బీట్‌తో ఫస్ట్ సింగిల్ రిలీజ్

Mirai

Mirai

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా యోధుడి పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, విలన్‌గా మంచు మనోజ్ ఆకటుకోనుండగా.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తేరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా 2డీ, 3డీ ఫార్మాట్లలో, మొత్తం 8 భాషల్లో విడుదల కానుంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగిల్ ‘వైబ్ ఉంది బేబీ’ విడుదలైంది. కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా, అర్మాన్ మాలిక్ తన చిలిపి గాత్రంతో పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. యూత్‌ఫుల్‌, ఎనర్జిటిక్ వోట్‌లో సాగిన ఈ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రానున్నాయి. అప్పటివరకు, ఈ ఫన్ ఫుల్ సాంగ్‌ని వినేయండి.

 

Exit mobile version