తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘మిరాయ్’. ప్రజంట్ ఈ మూవీ షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా. టీజర్‌లో చూపిన విజువల్స్, తేజా సజ్జా పవర్‌ఫుల్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ మూడ్ సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన చిత్ర బృందం.. తాజాగా ఇప్పుడు ఓ మ్యూజికల్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమైంది.
Also Read : Hari Hara Veeramallu : వైజాగ్ బీచ్ రోడ్ పై పవన్ హవా.. పవన్ ఫ్యాన్స్‌కి మరో బంపర్ ట్రీట్..
అప్‌డేట్ ప్రకారం, మిరాయ్ ఫస్ట్ సింగిల్‌ను జూలై 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫీల్‌తో పాటు మ్యాజికల్ మెలోడీకి ప్రాధాన్యం ఉండేలా ఈ పాటను రూపొందించారని మేకర్స్ చెబుతున్నారు. అలాగే కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో తేజా సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనుండగా, మంచు మనోజ్ ఈ సినిమాలో కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. విలనిజానికి కొత్తగా డిజైన్ చేయబడిన ఈ పాత్ర ద్వారా మనోజ్ సినిమాకు ప్రధాన బలంగా మారనున్నాడు. రిథికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ 8 భాషలలో సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు కూడా ఇప్పటికే భారీగా పెరిగాయి.
