Site icon NTV Telugu

Mirai : రిలీజ్‌కి ముందే లాభాల బాటలో మిరాయ్..

Mirai (2)

Mirai (2)

‘మిరాయ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్‌లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్‌తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న  తేజ సజ్జా..

Also Read : Allari Naresh : మళ్లీ కామెడీ జానర్‌లో #నరేష్65 గ్రాండ్ గా లాంచ్- ఫస్ట్ క్లాప్ కొట్టిన నాగ చైతన్య

అయితే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ఇప్పటికే లాభాలను సాధించిందని సమాచారం. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా 45 కోట్లు ఆదాయం, విడుదలకు ముందే 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌ను నిర్మాతలు రాబట్టారు. నేటి సవాలుతో కూడిన సినిమా మార్కెట్‌లో ఇది గణనీయమైన విజయమే. ఈ సంవత్సరం అనేక భారీ బడ్జెట్, మధ్యస్థ-శ్రేణి చిత్రాలు ఖర్చును తిరిగి పొందడంలో విఫలమయ్యాయి. చాలా చిత్రాలు పాన్-ఇండియా ట్రెండ్‌ను అనుసరించగా, కొన్ని చిత్రాలు మార్కెట్‌లో ఆశించిన ఆదాయాన్ని అందుకోలేకపోయాయి. కానీ తేజ సజ్జానటించిన ‘మిరాయ్’ మాత్రం విడుదలకు ముందే మంచి లాభాలు సంపాదిస్తోంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ట్రైలర్‌కు అన్నిభాషలలో వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, నిర్మాతలు థియేట్రికల్ హక్కుల కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవకాశాన్ని తిరస్కరించి, స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇది కంటెంట్ పై ఉన్న వారి బలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. మొత్తనికి ‘మిరాయ్’ అధిక ఖర్చు లేకుండా, స్టార్ పవర్‌పై ఆధారపడకుండా, నాణ్యత గల సినిమా సృష్టించవచ్చని నిరూపించింది.

Exit mobile version