మెగాస్టార్ ప్రస్తుతం వసిష్ఠతో ‘విశ్వంభర’ ముగించి అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఇటీవల దర్శకుడు బాబీతో మెగాస్టార్ సినిమా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు. గతంలో ఈ కాంబోలో ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ అక్టోబరులో బాబీ – మెగాస్టార్ సినిమాల మొదలు కానుంది. అయితే తాజాగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచుకున్న మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా కాదులెండి.
బాబీ – చిరు కాంబోలో వస్తున్న సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనిని ఫిక్స్ చేసారు. తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో మెచ్చుకోదగ్గ సినిమా తీసాడు కార్తీక్. సూపర్ యోధగా తేజా సజ్జాను,బ్లాక్ స్క్వాడ్ పాత్రలో మంచు మనోజ్ ను బాగా హ్యాండిల్ చేసాడు అనే కితాబు అందుకున్నాడు దర్శకుడు. ఈ నెల 12న రిలీజ్ అయిన మిరాయ్ సూపర్ హిట్ టాక్ తో పాటు భారీ వసూళ్లు కూడా రాబట్టింది. అయితే ఇంతటి భారీ హిట్ అందుకుని కూడా నెక్ట్స్ డైరెక్టర్ గా కాకుండా సినిమాటోగ్రాఫర్ గా చేసేందుకు రెడీ అయ్యాడు కార్తీక్. మీరాయ్ సక్సెస్ ను ఎంజాయ్ చేసి ఆ వెంటనే చిరు సినిమాకు వర్క్ చేయబోతున్నాడు కార్తీక్. డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ ఘట్టమనేనిని సినిమాటోగ్రాఫర్ గా మెగాస్టార్ ను ఎలా చూపిస్తారో చూడాలి. బాబీ – చిరు సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా రాబోతుంది.
