Hari Katha: తలసాని ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరణ్, రంజిత్, సజ్జన్, అఖిల్ రామ్, లావణ్య రెడ్డి, కీర్తి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘హరికథ’. ఐరావత సినీ కలర్స్ బ్యానర్ పై రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు , కవిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అనుదీప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అనుదీప్ రెడ్డి మాట్లాడుతూ, ”ఈ ‘హరికథ’ వినూత్నమైన సినిమా. అన్ని వర్గాలకు నచ్చే కుటుంబ, ప్రేమ కథా చిత్రం. ఎక్కడా రాజీ పడకుండా తీర్చిదిద్దిన సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది” అని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ”దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. దర్శకుడు కథ చెప్పిన విధంగానే సినిమా బాగా తీశారు. నటీనటులందరూ ఎంతో చక్కగా నటించారు. త్వరలోనే మంచి విడుదల తేదీతో ప్రేక్షకుల ముందుకు వస్తాం. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు” అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా మస్తాన్ షరీఫ్ వ్యవహరించగా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. మహావీర్ సంగీతం సమకూర్చారు.
Also Read
- Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
- I'm Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
- EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా 'ఇ.ఎం.ఐ' టెన్షన్
- BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
తాజావార్తలు
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్‌బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!