NTV Telugu Site icon

Actress Roja Daughter Anshu: ఓ సినీ వారసుడుతో హీరోయిన్‌ రోజా కూతురు.. సినిమాల్లో ఎంట్రీకి సిద్ధం?

Roja3

Roja3

Minister Roja’s daughter who is going to enter as a heroine: టాలీవుడ్‌ ఇండ్రస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్‌ స్టార్‌ హీరోయిన్‌ గా కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది నటి రోజా. టాలీవుడ్‌ లో ఉన్నటువంటి అగ్ర హీరోలందరితో కలిసి ఆమె నటించింది. ఇలా సినిమాల ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్న రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని లేదా వైసీపీ పార్టీని ఎవరేమైనా అంటే తనదైన శైలిలో కౌంటర్ లు ఇస్తూ ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తూ.. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. రోజా హీరోయిన్ గా అప్పట్లో చిరంజీవి తరం హీరోలతో చాలా సినిమాలు చేయటం తెలిసిందే.

రోజా తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అనేక భాషలలో నటించడం జరిగింది. రోజా హీరోయిన్ గా మాత్రమే కాదు, క్యారెక్టర్ సపోర్ట్ ఆర్టిస్ట్ రోల్ లో కూడా పలు సినిమాలు చేసి ఆమె, ఆ ఇమేజ్ తో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయి పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసి, తర్వాత వైసీపీ లో జాయిన్ అయి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా రాణిస్తున్నారు. రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్​ క్రేజ్​ను సంపాదించుకుంది. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించింది.

అయితే.. ఇప్పుడు రోజా కూతురు అన్షు మాలిక కూడా సినిమాల్లో రానుందంటూ కొద్ది రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అదికూడా.. ఓ సినీ వారసుడు నటించినున్న చిత్రం ద్వారా హీరోయిన్​ గా అరంగేట్రం చేయనుందని కథనాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తన వారసురాలిగా కూతురుని సినిమా రంగంలో రోజా తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే.. కూతురు అన్షుమాలికనీ ఓ సినీ వారసుడు నటించనున్న మూవీలో హీరోయిన్ గా అరంగేట్రం చేయించడానికి రోజా ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

రోజా తన కూతురు అన్షుమాలికకు యూఎస్‌ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ ఇప్పిస్తోందని, త్వరలో అన్షుమాలిక అక్కడ జాయిన్ కానుంది. దీంతో.. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్‌గా రోజా తరం హీరోయిన్ లలో రాధ, శ్రీ దేవీ కూతుర్లు హీరోయిన్ లుగా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. అయితే.. వీళ్లలో శ్రీ దేవీ కూతురు జాహ్నవి కపూర్ మాత్రమే సక్సెస్ ఫుల్ గా రానిస్తోంది. మరి రోజా కూతురు అన్సు సినిమా ఎంట్రీ ఇస్తే చూడాలి.
Mumbai Threat Case: ముంబై ఉగ్ర బెదిరింపుల కేసు.. ఒకరు అరెస్ట్

Show comments