NTV Telugu Site icon

Yash: యష్ కి ఊహించని షాక్.. ఏమైందంటే?

Yash Pooja Hegde

Yash Pooja Hegde

రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీమ్‌కి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే షాక్ ఇచ్చారు. విష‌య‌మైన చిత్ర బృందంపై కేసు న‌మోదు చేయాల‌ని మంత్రి స్వయంగా ఫారెస్ట్ అధికారుల‌ను ఆదేశించారు. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) కెనరా బ్యాంక్‌కు విక్రయించినట్లు ఆరోపించిన అటవీ భూమిలో టాక్సిక్ మూవీని సెట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికింది. ఈ నేప‌థ్యంలో పీణ్య‌లోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో చిత్ర టీమ్‌ని టార్గెట్ చేశారు మంత్రి. పీణ్య సమీపంలోని హెచ్‌ఎంటీ ప్లాంటేషన్‌లో రెండ్రోజుల పాటు షూటింగ్ ప్రారంభించిన మూవీ టీమ్.. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోకుండా చెట్లను నరికివేశారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఇది నేరం. ముఖ్యంగా అటవీ భూమిలో చెట్లను నరకడం శిక్షార్హమైన నేరం. ఈ నేప‌థ్యంలో మంత్రి ఈశ్వ‌ర్ ఖండ్రే ఎన్ని చెట్లను నరికివేశారు? నిబంధనల ప్రకారం దీనికి అనుమతి లభించిందా? అనుమతి ఇస్తే అటవీ భూమిలో చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చిన అధికారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Game Changer: మొన్న పుష్ప.. ఇప్పుడు గేమ్ ఛేంజర్!

అనుమతి లేకుండా చెట్టును నరికితే బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఫారెస్ట్ క్రైమ్ కేసు పెట్టాలని మంత్రి ఈశ్వర్ ఖండ్రే సూచించారు. అనంతరం ఆ సెట్స్ సందర్శించి పరిశీలించిన అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే.. సినిమా సెట్‌ నిర్మాణం కోసం చెట్లను నరికిన చిత్ర బృందంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా అటవీశాఖ హెచ్చరించింది. మంత్రి ఈశ్వర ఖండ్రే దీని గురించి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X,లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఆక్రమిత అటవీ భూమిలో ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ కోసం వందలాది చెట్లను అక్రమంగా నరికి ధ్వంసం చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ చట్టవ్యతిరేక చర్య శాటిలైట్ చిత్రాలను బట్టి స్పష్టంగా కనిపిస్తోందని, ఈరోజు ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించా. ఈ చట్టవ్యతిరేక చర్యకు బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించా. మన అడవులను, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి ప్రధాన బాధ్యత. అటవీ భూముల్లో అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నానని పోస్ట్‌లో రాశారు.

Show comments