NTV Telugu Site icon

Minister Anitha: కామెంట్స్ కలకలం.. పవన్ కల్యాణ్ తో మంత్రి అనిత భేటీ

Pawan Anithaa

Pawan Anithaa

గతంలో హోంమంత్రిపై పవన్‌ వ్యాఖ్యలు అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు – పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన పవన్ తాను హోంమంత్రి అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితల భేటీపై ఉత్కంఠ నెలకొంది.

Jet Airways: ముగిసిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం.. ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

ఇక ఈ అంశం మీద అనిత స్పందించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో స్పందించారు. రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ తో మర్యాదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న నేరాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలని, ఆడబిడ్డలకు అన్యాయం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జన సంక్షేమం, శ్రేయస్సు కోసం ప్రతిక్షణం పరిశ్రమించే ప్రజా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అంటూ ఆమె రాసుకొచ్చారు.

Show comments