Site icon NTV Telugu

Tamannaah : బ్రేకప్ తర్వాత ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేస్తున్న మిల్కీ బ్యూటీ

Tamannah

Tamannah

బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ.. వెయిట్ లాస్ అయ్యింది.

Also Read : VIJAY : జన నాయకుడు థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్.. ఇండస్ట్రీ రికార్డ్?

తమన్నా స్లిమ్ కావడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఇక గిట్టని వాళ్లు కొన్ని వార్తలు పుట్టించారు. మిల్కీ బ్యూటీ మెడిసిన్స్ వాడిందని, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. రీసెంట్లీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తమన్నాకు క్వశ్చన్ ఎదురైతే క్లారిటీ ఇచ్చింది బేబి. ‘15 ఏళ్ల నుండి కెమెరా ముందు నటిస్తూనే ఉన్నా, తన లైఫ్‌లో ఎక్కువ భాగం కెమెరా ముందే ఉన్నా..ఈ విషయం ప్రేక్షకులకు తెలుసు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అప్పుడెలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. సాధారణంగా ప్రతి మహిళలలో ఐదేళ్లకొకసారి మార్పులు సహజం. కోవిడ్ టైంలోనే శారీరకంగా కాస్త దెబ్బతిన్నా అప్పుడే వెయిట్ లాస్ కోసం కాస్త కష్టపడ్డా‘ అని చెప్సొచ్చింది తమ్ము. విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక వరుస పెట్టి ఛాన్సులు కొల్లగొడుతుంది తమన్నా. ఓ వైపు స్పెషల్ సాంగ్స్, ఇంకో వైపు ఫీమేల్ లీడ్స్ క్యారెక్టర్లతో ఫుల్ స్వింగ్ లో ఉంది స్వింగ్ జరా బ్యూటీ. హిందీలో ఓ రోమియా, రేంజర్, వివాన్, రాగిణీ ఎంఎంఎస్3తో పాటు తమిళంలో విశాల్- సుందర్ సి కాంబోలో ఫిల్మ్ చేయబోతోంది. ఇక తెలుగులో ఓదెల2 తర్వాత కనిపించని ఈ భామ మన శంకర్ వర ప్రసాద్ గారూలో స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ నడుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 హీరోయిన్ గా..సరిలేరు నీకెవ్వరూ స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనిల్.. తమన్నాను అప్రోచ్ అయ్యాడని టాక్.

Exit mobile version