Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాస్ ఏంజిల్స్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారాలైన 98వ అకాడమీ అవార్డుల (Oscars 2026) ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మైఖేల్ బి. జోర్డాన్ ఉత్తమ నటుడి విభాగంలో తన కెరీర్‌లో మొదటి ఆస్కార్‌ను అందుకున్నారు. దర్శకుడు ర్యాన్ కూగ్లర్ తెరకెక్కించిన ‘సినర్స్’ చిత్రంలో జోర్డాన్ పోషించిన ద్విపాత్రాభినయం (స్మోక్ మరియు స్టాక్) విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ విభాగంలో గట్టి పోటీనిచ్చిన లియోనార్డో డికాప్రియో, తిమోతీ చాలమెట్ వంటి హేమాహేమీలను వెనక్కి నెట్టి జోర్డాన్ ఈ ఘనత సాధించడం విశేషం.
అవార్డు అందుకున్న అనంతరం జోర్డాన్ చాలా భావోద్వేగానికి లోనయ్యారు.ఆస్కార్ వేదికపై జోర్దాన్ మాట్లాడుతూ ” దేవునికి అలాగే నా తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా తన చిరకాల మిత్రుడు, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ “నన్ను నమ్మి, నాలోని ప్రతిభను ప్రపంచానికి చూపినందుకు థాంక్స్. నా కెరీర్‌లో నాకు మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను గొప్ప విజయాలు సాధించాలని మీరు కోరుకుంటున్నారని నాకు తెలుసు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నిస్తా. అలాగే తనకంటే ముందు ఆస్కార్ అందుకున్న నల్లజాతీయులైన సిడ్నీ పోయిటియర్, డెంజెల్ వాషింగ్టన్ వంటి మహానటులకు హ్యాట్సాఫ్’ అని అన్నారు.
Also Read
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ఈ విజయంతో ఆస్కార్ చరిత్రలో ‘ఉత్తమ నటుడు’ అవార్డును గెలుచుకున్న ఆరవ నల్లజాతీయుడిగా మైఖేల్ బి. జోర్డాన్ నిలిచారు. గతంలో ‘ఫ్రూట్‌వేల్ స్టేషన్’, ‘క్రీడ్’, మరియు ‘బ్లాక్ పాంథర్’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు, ఈ అవార్డు దక్కడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!