Site icon NTV Telugu

Merge Movie: సైన్స్ ఫిక్షన్ తో MERGE చేసేస్తారట!!

Merge Movie Opening

Merge Movie Opening

Merge Movie Opening: కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాక సైన్స్ ఫిక్షన్ కథల మీద నమ్మకం కలుగుతోంది. నిజానికి ముందు నుంచి సైన్స్ ఫిక్షన్ కథలకు ప్రత్యేకమైన అభిమానులు ఉండేవారు. అయితే ఇప్పుడు ఇలాంటి కథలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా లేడీ లయన్ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 03 సినిమా మొదలైంది. రాజు గుడి గుంట్ల నిర్మాణం లో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో “MERGE ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Krithi Shetty: ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతిశెట్టి

ఈ సినిమా ఓపెనింగ్ ఈరోజు హైదరాబాద్ లోని శ్రీ భద్రకాళి పీఠం లో డా|| సింధు మాతాజీ ఆశీస్సులతో ఘనంగా జరిగింది. ఈ సినిమాలో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య ,పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు, తదితరులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇక ఈ సినిమా పూజ అనంతరం నిర్మాత రాజు గుడిగుంట్ల మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల 15 వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ తరహాలో రొటీన్ కథకు భిన్నంగా తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు.

Exit mobile version