Site icon NTV Telugu

Chiranjeevi : మే డే సందర్బంగా మెగాస్టార్ స్పెషల్ వీడియో..వైరల్

Whatsapp Image 2024 05 01 At 4.28.50 Pm

Whatsapp Image 2024 05 01 At 4.28.50 Pm

నేడు ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి కార్మిక లోకానికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు .ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ఓ స్పెషల్‌ వీడియోను కూడా షేర్‌ చేశారు. 20 సంవత్సరాల క్రితం బాలకార్మికుల నిర్మూలన కోసం చేసిన ఓ ప్రచార వీడియోను నేడు కార్మికుల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ ఎక్స్‌ వేదికగా షేర్ చేస్తూ.. హ్యాపీ మే డే టు ఆల్ అంటూ పోస్ట్‌ చేసారు. ఆ వీడియో ద్వారా 22 సంవత్సరాల క్రితం.. పసి పిల్లలని పని పిల్లలుగా మార్చొద్దని అంతర్జాతీయ కార్మిక సంస్థ కోసం ‘చిన్ని చేతులు’ పేరుతో ప్రచారం చేసినట్లు తెలిపారు.ఈరోజు ఆ వీడియో రిలవెంట్‌గా అనిపించి షేర్ చేస్తున్నానని మెగాస్టార్ తెలిపారు.

సే నో టు చైల్డ్ లేబర్. అందరికీ మే డే శుభాకాంక్షలు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగాస్టార్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్‌ అవుతోంది.ఇదిలా ఉంటే మెగా స్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ లో బిజీ గా వున్నారు.బింబిసార ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను అద్భుతమైన విజువల్స్ తో బిగ్గెస్ట్ ఫాంటసీ మూవీగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తన్నారు .ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు .వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది .ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయినా కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది .

Exit mobile version