NTV Telugu Site icon

Megastar Chiru : బాసూ నీ టైమింగ్ ని కొట్టేవాళ్ళు లేరు..

Megastar

Megastar

టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. మంగళవారం జరిగిన ఈవెంట్ లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ‘జీబ్రా’లో మంచి కంటెంట్ వుంది. తప్పకుండా జీబ్రా సూపర్ హిట్ బొమ్మ అవుతుంది అని అన్నారు అని మెగాస్టార్ చిరంజీవి. ఈ జీబ్రా ట్రైలర్ లాంఛ్ వేడుకలో జరిగిన ఓ సరదా సన్నివేశానికి చెందిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : OTT : ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..

ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరు వేదికపై మాట్లాడుతుండగా ఓ అభిమాని గట్టిగా అరుస్తూ ” బాసూ మిమ్మల్ని చూసేందుకు నేను వైజాగ్‌ నుంచి వచ్చాను, మీ కోసం వచ్చాను బాసు’ అని అన్నాడు. అప్పటిదాకా ఈ సినిమా గురించి మాట్లాడుతున్న చిరు ఒక్కసారిగా స్పీచ్‌ ఆపేసి ‘అయితే ఏటంటావ్‌ ఇప్పుడు, నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే, మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి భలేవాడివే, మన హీరోది కూడా అదే ఊరు మరి, కుసో కుసో రా కాసేపు” అంటూ ఉత్తరాంధ్ర యాసలో సమాధానం ఇచ్చారు. దీంతో ఈవెంట్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్న ప్రేక్షకులు, ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చిరు టైమింగ్‌ సూపర్‌’, ‘బాసూ నీ టైమింగ్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments