NTV Telugu Site icon

Mega Star : వ్యోమగాముల రాకనుద్దేశిస్తూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

Chiru (2)

Chiru (2)

గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు సునీతా విలియమ్స్. అయితే వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయిరు. ఆమెను తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్‌మోర్‌లు ఎట్టకేలకు స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి తిరిగి వచ్చారు. భూ వాతావరణానికి అలవాటు పడేంతవరకు వారికి తగిన చికిత్స అందించనున్నారు.

Also Read : Aditi Shankar : ఎల్లోరా శిల్పంలా మెరుస్తున్న అదితి శంకర్

వ్యోమగాములు తిరిగి వచ్చిన నేపథ్యంలో వారికి ప్రపంచ నలుమూలల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అటు సినీ స్టార్స్ తో పాటు ఇటు రాజకీయ ప్రముఖులు సునీతా విలియమ్స్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వ్యోమగాములు రాక పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు. చిరు వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో ‘వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై సంతోషంగా ఉంది. 8 రోజులు అంతరిక్షంలోకి వెళ్లి, 286 రోజుల తర్వాత, భూమి చుట్టూ 4577 సార్లు తిరిగి వచ్చాన వారికి సుస్వాగతం. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు. ఇదొక బ్లూ బ్లాక్ బస్టర్’ అని  ట్వీట్ చేస్తూ వ్యోమగాములను అభినందించారు.