మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ హిట్ మూవీ “లూసిఫర్” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ రీమేక్ కు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అతను రెండు దశాబ్దాల తరువాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం మోహన్ రాజా “లూసిఫెర్” రీమేక్ కోసం సెట్లను రూపొందించే పనిలో పడ్డారట. చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న “ఆచార్య” కోసం భారీ ఆలయాన్ని సృష్టించిన ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ సెల్వరాజన్ ఈ “లూసిఫెర్” రీమేక్ కోసం కూడా పని చేస్తున్నారు.
Read Also : శిల్పాశెట్టి కెరీర్ కు రాజ్ కుంద్రా వ్యవహారంతో బ్రేక్!
నిన్న సాయంత్రం సురేష్ తన ట్విట్టర్‌లో “ఏదైనా కొత్తదనం ఆనందాన్ని ఇస్తుంది. కొత్త రోజు, కొత్త ప్రారంభం. నా క్రొత్త సినిమా కోసం సెట్ పనిని ప్రారంభిస్తున్నాను. నేను మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నాను” అంటూ షేర్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన “లూసిఫెర్” రీమేక్ కోసం సురేష్ సెల్వరాజన్ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌వి ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అప్పారావ్ సంయుక్తంగా నిర్మిస్తుండగా… తమన్ సంగీతం అందిస్తున్నాడు. “లూసిఫెర్” రీమేక్ రెగ్యులర్ షూట్ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి చేస్తున్న “ఆచార్య”ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
