Site icon NTV Telugu

“లూసిఫర్” రీమేక్ టైటిల్ ఫిక్స్ ?

Megastar Chiranjeevi’s Lucifer Telugu remake is ‘God Father’

మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌ పవర్ ఫుల్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే “ఆచార్య” విడుదల కానుంది. ఆ తరువాత చిరంజీవి ప్రధాన పాత్రలో మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” రీమేక్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టు 13న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు మోహన్ రాజా సినిమా షూటింగ్ ను పలు షెడ్యూల్లలో త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ చిత్రానికి సంబంధించిన అనేక ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : కృతి సనన్ “మిమి”పై సమంత రివ్యూ

తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్, ఆయన బృందం ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ ను నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందనుంది. ఎన్‌వి ప్రసాద్, రామ్ చరణ్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మించనున్నారు. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూర్చారు. “గాడ్ ఫాదర్” వచ్చే ఏడాది థియేట్రికల్ విడుదలకు రెడీ అవుతుంది. సినిమా టైటిల్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి “వేదాళం” రీమేక్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “గాడ్ ఫాదర్” షూటింగ్ పూర్తయ్యాక కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తారు.

Exit mobile version