మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆంజనేయ స్వామికి ఎంత పెద్ద భక్తుడో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఆయన అయ్యప్ప స్వామి మాల ధారణ కూడా వీలున్న ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా తాజాగా ఆయన మాలధారణ చేశారు. తాజాగా చిరంజీవి ఒక ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి తన భార్య సురేఖతో కలిసి హాజరయ్యారు. ఆ హాజరైన సమయంలోనే ఆయన అయ్యప్ప మాలలో కనిపించారు. అయితే, దీపావళి రోజు జరిగిన ఉపాసన సీమంతం వేడుకలలో మాత్రం ఆయన మాల ధారణ చేసి కనిపించలేదు.
Also Read :Siddhu Jonnalagadda : బ్యాడాస్ స్టోరీ లీక్!
అంటే దీపావళి తర్వాత ఆయన మాలధారణ చేశారని చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా అయ్యప్ప మాలధారణ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయం చూస్తే, ఆయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అనే సినిమా చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
