NTV Telugu Site icon

Chiranjeevi: తల్లి అనారోగ్యం వార్తలు.. దయచేసి ఇక ఆపండి అంటూ చిరంజీవి ట్వీట్

Chiranjeevi

Chiranjeevi

ఈ రోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురైందని కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత దాన్ని మెగాస్టార్ చిరంజీవి టీం ఖండించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం మీద మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ట్విట్ చేశారు. తన తల్లి అంజనమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు వార్తలు వచ్చిన విషయం నా దృష్టికి వచ్చింది. అయితే ఆమె రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆమె కోలుకుంది. ఆమెకి ఎలాంటి ఇబ్బంది లేదు, అని ఆయన చెప్పుకొచ్చారు.

Harish Shankar: చిన్న సినిమాలో హరీష్ శంకర్

దయచేసి మీడియా ఇక ఆమె ఆరోగ్యం గురించి ఎలాంటి వార్తలు రాయవద్దంటూ ఆయన కోరారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా పెళ్లి రోజు జరుపుకున్నారు. తన సతీమణి సురేఖతో పాటు నాగార్జున దంపతులతో కలిసి ఆయన దుబాయి వెళ్లారు. అక్కడ ఆయన పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నారు. ఇక త్వరలో జరగబోతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావలసిన ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్ వర్క్స్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.