Chiranjeevi on Kalki 2898 AD : పౌరాణిక సైన్స్ ఫిక్షన్ ఎంటర్‌టైనర్ కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టిస్తోంది కల్కి 2898 ఏడీ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సెలబ్రిటీలు వారి ప్రయత్నాలకు చిత్ర బృందాన్ని ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్ వేదిగా నా ఫేవరేట్ ప్రొడ్యూసర్‌కు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌పై మూవీ టీమ్ మొత్తానికి చిరు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సినిమా చూడకపోయినా.. అందరి పొగడ్తలు వింటుంటే చాలా ఆనందంగా ఉందని చిరు చెప్పారు.
Read Also: Bollywood Actresses: ప్రెగ్నెన్సీతో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న హీరోయిన్లు వీరే..
“కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్టులు వినిపిస్తున్నాయి. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద స్టార్లతో ఇలాంటి మైథలాజికల్ సై ఫి ఫ్యూచరిస్టిక్ సినిమా తీసిన నాగ్ అశ్విన్ క్రియేటివ్ జీనియస్‌కు అభినందనలు. నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్వినిదత్ గారికి, ఎంతో అభిరుచి కలిగిన, ధైర్యవంతులైన స్వప్న దత్, ప్రియాంకా దత్, ఈ ఘనత సాధించిన మొత్తం టీమ్ కు నా శుభాకాంక్షలు. ఇలా కలలు కంటూనే ఉండండి. ఇండియన్ సినిమా పతాకాన్ని మరింత పైకి ఎగరేస్తూనే ఉండండి” అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అనేక అద్భుతమైన చిత్రాలు నిర్మితమయ్యాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, జైచిరంజీవ లాంటి సూపర్ హిట్ సినిమాలు వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో వచ్చాయి.