Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?
- విశ్వంభర చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్
- సంక్రాంతి కానుకగా విశ్వంభర రిలీజ్ ఫిక్స్
- మెగా తనయ నిర్మాణంలో మరో చిత్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచింది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు నిర్మాతలు.
ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ చివరి దశలో ఉండగా చిరు తర్వాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. చిరు కెరీర్ లో 157వ చిత్రంగా రానుంది.ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చెన్నై లో శరవేగంగా జరుగుతోంది. రచయిత కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి ఈ చిత్రానికి కథా సహకారం అందించనున్నాడు. గతంలో మెగాస్టార్ తో గాడ్ ఫాదర్ వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు మోహన రాజా చిరు 157 చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ ఈ సినిమా లో పెళ్లి అయిన మధ్య వయస్కుడి గా కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చిరు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ చిత్రాన్ని మెగాస్టార్ ముద్దుల తనయ కొణిదల సుస్మిత నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటించనున్నారు మేకర్స్. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Also Read
- Fauzi Release Date : 'ఫౌజీ' రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
- Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
- Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
- Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్‌ను పట్టించుకోడా?
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!