టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. 2026 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల గ్రాస్‌తో దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రాంతీయ సినిమాగా వరప్రసాద్ గారు నిలిచారు. ఇక మెగాస్టార్ నటించనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘మెగా 158’ (Mega158). ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీ కొల్లి మెగా 158ను తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మెగా 158లో యంగ్ హీరోయిన్ కృతి శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు పాత్రకు బేబమ్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడం, వయసు కూడా పాత్రకు సరిగ్గా సరిపోవడంతో కృతిని ఎంపిక చేశారట. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే కృతికి ‘మెగా’ ఛాన్స్ అనే చెప్పాలి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న బేబమ్మకు ఈ అవకాశం రావడం పెద్ద బూస్ట్. ఇందులో కృతి సరసన ఓ యువ హీరో నటించనున్నట్లు సమాచారం.
Also Read: Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. నంబర్–3లో బ్యాటింగ్ చేసేది ఎవరంటే?
ఇప్పటికే మెగా 158 కథా చర్చలు దుబాయ్‌లో జోరుగా సాగుతున్నాయని సమాచారం. బలమైన ఎమోషన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌కి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు. అలాంటి పాత్రకు కృతి శెట్టి ఎంపిక కావడం ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా మారనుంది. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పని చేయనుండటం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. చిరంజీవి–బాబీ కాంబినేషన్, రెహమాన్ సంగీతం, కృతి శెట్టి పాత్ర.. Mega158పై భారీ బజ్ ఏర్పడింది.
