Site icon NTV Telugu

MEGA 157 : లీక్‌లపై ‘మెగా 157’ టీమ్ నుండి స్ట్రాంగ్ వార్నింగ్ ..

Mega157

Mega157

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మెగా 157’ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్లు ఏవీ బయటకు రాకపోయినా, అభిమానులలో మాత్రం ఉత్కంఠ ఏ మాత్రం తగ్గడం లేదు.

Also Read : Shah Rukh Khan : ‘కింగ్’ మూవీ కి బ్రేక్.. షూటింగ్‌లో షారుఖ్‌కు గాయాలు..?

ఇప్పటివరకు షూటింగ్ వివరాలు బయటకు రాకుండా బాగా జాగ్రత్తలు తీసుకుంటున్న బృందానికి.. ఒక చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న షెడ్యూల్‌లో చిరంజీవి – నయనతారపై కీలక సన్నివేశాలు, ఒక పాట చిత్రీకరిస్తుండగా, అందులో భాగంగా ఓ వీడియో లీక్ అయింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయాన్ని గమనించిన చిత్రబృందం తాజాగా అధికారికంగా స్పందించింది.. అలాంటి లీక్‌లను పంచుకోవద్దని .. అభిమానులు మేకర్స్ నుండి వచ్చే అధికారిక అప్డేట్‌ కోసం ఓపికగా ఉండాలని, లీక్‌డ్ కంటెంట్‌ను షేర్ చేయకుండా సహకరించాలని బృందం విజ్ఞప్తి చేస్తోంది.

‘ఇలా సెట్స్ లోపల తీసిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడం వల్ల సినిమా మీద నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. పైగా ఇది కేవలం లీక్ కాదు, కాపీరైట్ హక్కుల ఉల్లంఘన కూడా. ఇలా ఎవరు చేస్తే, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ సినిమా జాగ్రత్తగా, ప్రేమతో, ఎంతో కష్టపడి చేస్తున్నారు. అందుకే ఫ్యాన్స్‌కి, మీడియా వేదికలకి ఒకే అభ్యర్థన, మాకు తోడుగా ఉండండి. అధికారిక సమాచారం రాగానే మేమే మీతో పంచుకుంటాం. మనమంతా కలసి ఈ ప్రాజెక్ట్‌ను అందంగా, బాగుపడేలా చూసుకుందాం. ఎలాంటి లీక్‌లు లేకుండా మనం సమర్థంగా ముందుకు సాగుదాం. మీ ప్రేమ, సహకారం కోసం ధన్యవాదాలు’ అంటూ నోట్ విడుదల చేశారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

Exit mobile version