సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి కథ వినిపించడం అందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం చక చక జరిగాయి.
నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలయిన చిరు – అనిల్ సినిమా రెగ్యులర్ షూట్ కు డేట్ లాక్ చేసారు. స్క్రిప్ట్ టోటల్ వర్క్ ఫినిష్ అవడంతో ఇక అన్ని ఏర్పట్లను ఫినిష్ చేసుకుని ఈ నెల 22 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమాతో వింటేజ్ చిరు మరోసారి ప్రేక్షకులను అలరిస్తాడని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. చిరు సరనస హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించగా ఫైనల్ గా కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతారకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. అందుకోసం భారీ మొత్తంలోనే ఛార్జ్ చేసిందట నయనతార. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్ బైనర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. చిరు అనిల్ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
