మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తోన్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ Mega158. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పూజా కార్యక్రమాలతో అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్‌కు సిద్ధమైంది.
మెగా 158 చిత్ర మొదటి షెడ్యూల్ కోసం మూవీ టీమ్ తమిళనాడులోని పొల్లాచికి తరలివెళ్లింది. ఈ రోజు నుంచే అక్కడ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్‌ను దాదాపు 15 రోజుల పాటు పొల్లాచి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో ప్లాన్ చేశారు. ఇందులో చిరంజీవిపై కొన్ని కీలకమైన సీన్లను డైరెక్టర్ బాబీ చిత్రీకరించనున్నారు. పొల్లాచి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం ఆదివారమే హైదరాబాద్ నుంచి బయలుదేరి లొకేషన్‌కు చేరుకుంది. ఈ సినిమాలో చిరు కూతురుగా మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ నటిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌తోనే స్పీడ్ పెంచడం మెగా అభిమానుల్లో జోష్ నింపుతోంది. మెగాస్టార్ రెండు విభిన్న రోల్స్ లో అలరించనున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, మలయాళ హీరోయిన్ నివేదా పెతురాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
