ఇటీవల టాలీవుడ్ లో భాగా వినిపిస్తున్న హీరోయిన్ పేర్లల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘హిట్ 2’ మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్.. ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో నటిస్తున్న మీనాక్షి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Also Read: Hit 3 : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లో నాని !
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ‘నా చిన్నతనంలో ఇతరులతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. ఈ కారణంగా నాతో చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. అప్పటలో నా ఎత్తు నాకు సమస్యగా మారింది. అప్పుడప్పుడు చాలా బాధగా కూడా అనిపించేది. ఇక ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరీక్షించుకో అని అన్నారు. దీంతో బుక్స్ నే స్నేహితులుగా మార్చుకున్న. బుక్స్ చదవడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆటలపై కూడా ఆసక్తి కలిగింది. ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకున్నాను. సాధ్యం అయినంత వరకు కష్టపడతాను. చిన్న పాత్ర కదా అని ఎప్పుడు వదులుకోకండి. ఎందుకంటే ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా కారణంగా నాకు ‘ఖిలాడీ’ సినిమాలో నటించే అవకాశం దక్కింది. కనుక ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆఫర్ కూడా కచ్చితంగా ముందు కెరీర్‌ని నిలదొక్కుకునేందుకు సహయపడుతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి నాకు ఎలాంటి సమస్యలేదు. అది ఒక జోనర్‌గా భావిస్తాను’ అని మీనాక్షి చెప్పుకొచ్చింది.
