Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పంపిణీ రంగానికి సరికొత్త అర్థం నేర్పిన దిగ్గజ సంస్థ ‘మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్’ (రామోజీ గ్రూప్ సంస్థ). కొన్ని సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో స్తబ్దత పాటించిన ఈ ప్రతిష్టాత్మక సంస్థ, మళ్లీ థియేటర్ల వ్యవస్థలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటం ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినిమా నిర్మాణం, పంపిణీ రంగాల్లో ఒకప్పుడు తిరుగులేని ముద్ర వేసిన రామోజీ గ్రూప్.. ఇన్నాళ్ల విరామం అనంతరం తన పునరాగమనం కోసం భారీ స్టార్ల సినిమాలను ఎంచుకోకుండా, కంటెంట్ బేస్డ్ సినిమా అయిన ‘తెల్ల కాగితంవైపు మొగ్గు చూపడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు మయూరి సంస్థ సిద్ధమైంది.
ఇక సాధారణంగా పెద్ద బడ్జెట్ చిత్రాలకే ప్రీమియర్ షోల నిర్ణయం కత్తిమీద సాములాంటిది. చిన్న తేడా వచ్చినా టాక్ దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అలాంటిది అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు, రిలీజ్‌కు ముందే ‘పెయిడ్ ప్రీమియర్స్’ వేస్తుండటం, దానికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేయడం ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. సినిమాలోని కంటెంట్‌పై తిరుగులేని నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ముందడుగు వేయడం అసాధ్యం. అగ్ర పంపిణీ సంస్థ అండదండలు తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయతకు మారుపేరైన మయూరి సంస్థ పునరాగమనం థియేటర్ వర్గాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుండగా, అక్టోబర్ 2న విడుదల కానున్న ‘తెల్ల కాగితం’ వెండితెరపై ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతోందో చూడాలి.
Also Read
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
తాజావార్తలు
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
-
Suma : నా స్క్రిప్ట్ లోనే దాచిపెట్టి దొంగదెబ్బ తీశారు! రాజమౌళి మాటలతో యాంకర్ సుమ ఎమోషనల్
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!