Site icon NTV Telugu

Maya Sabha: ఇంకా ట్రెండింగ్లో ‘మయసభ’!

Mayasabha

Mayasabha

‘మయసభ: రైజ్ ఆఫ్ టైటాన్స్’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది, ఆగస్టు 11–17, 2025 వారానికి గానూ ఓర్మాక్స్ మీడియా ఓ సర్వేని వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన స్ట్రీమింగ్ షోల జాబితాలో ‘మయసభ’ 3వ స్థానంలో ఉందని ఓర్మాక్స్ ప్రకటించింది. ఇప్పటికే ఈ సిరీస్ 2.8 మిలియన్ల వీక్షణలతో పాన్-ఇండియా వైడ్‌గా సంచలనం సృష్టించింది. భాషా సరిహద్దుల్ని చెరిపేస్తూ అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ‘మయసభ’ మెప్పిస్తోంది.

Also Read : Suhas: తమిళ్లో జెండా పాతేట్టున్నాడే!

దేవా కట్టా, కిరణ్ జే కుమార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన మయసభ సిరీస్‌లో కాకర్ల కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి పోషించారు), ఎంఎస్ రామి రెడ్డి (చైతన్య రావు) ప్రయాణాన్ని అందరూ చూసి ఆశ్చర్యపోయారు. వారిద్దరి మధ్య ఏర్పడిన బంధం, స్నేహంతో వేసిన అడుగులు, వారి గమ్యం, లక్ష్యం, రాజకీయ చదరంగం ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. హిట్‌మెన్ & ప్రూడోస్ ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై దేవా కట్టా తీసిన ఈ సిరీస్‌లో దివ్య దత్తా, సాయికుమార్, నాజర్, శత్రు, రవీంద్ర విజయ్, తాన్య రవిచంద్రన్ వంటి స్టార్ తారాగణం నటించింది.

Exit mobile version