సోనీ లివ్ నుంచి రాబోతోన్న ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు. ఇక ‘మయసభ’ టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఈ సిరీస్‌ను ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో గురువారం నాడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..
Also Read:Vijay: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అని ఎమోషనల్ అవుతున్నారు!
దేవా కట్టా మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన మా డియర్ బ్రదర్ తేజ్‌కు థాంక్స్. ‘మయసభ’ అనేది అందమైన ఊహ. ఇద్దరు ప్రాణ స్నేహితుల ప్రయాణమే ఈ కథ. పరిస్థితుల వల్ల వారిద్దరి మధ్య ఏర్పడిన దూరం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో తీశాం. ఈ కాన్సెప్ట్ నాకు చిన్నప్పటి నుంచీ మెదడులో కదులుతూనే ఉండేది. అయితే శ్రీ హర్ష అనే వ్యక్తి నా వద్దకు వచ్చి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు. అప్పుడు మొదలైందే ఈ ‘మయసభ’. ముందుగా మూడు పార్టులుగా సినిమాకు సంబంధించిన కథ రాశాను. అయితే సినిమాగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఆ తరువాత ఇదే కథను ఓ సిరీస్‌లా ఓ సీజన్‌ను రాసుకున్నాను. ‘మయసభ’ ఇక్కడి వరకు రావడానికి చాలా టైం పట్టింది. ధనీష్‌ను కలిసిన తరువాతే ‘మయసభ’కు ఈ లుక్ వచ్చింది. స్కామ్, మహారాణి వంటి ఎన్నో సెన్సేషనల్ సిరీస్‌లను సోనీ లివ్ అందించింది. సోనీ నుంచి అద్భుతమైన కథలు వచ్చాయి. వారి వద్దకు ఏదో ఒక ప్రాజెక్ట్ కోసం వెళ్లాను. అప్పుడు ధనీష్ కలిశారు. ఆయనకు ‘మయసభ’ పాయింట్ చెప్పాను. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది. ఆయన వల్లే ఈ ప్రాజెక్ట్ జనాల్లోకి వెళ్లింది. కిరణ్ నాతో ఎన్నో ఎళ్ల నుంచి ప్రయాణిస్తున్నారు. బాహుబలి, రిపబ్లిక్ టైంలోనూ ఆయన నాకు రైటింగ్ టైంలో తోడు నిలిచారు. విజయ్ నాకు ఎప్పుడూ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. విజయ్ వల్లే ‘ప్రస్థానం’ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కి కూడా విజయ్ బ్యాక్ బోన్‌లా నిలిచారు. ఆది నటన అంటే నాకు చాలా ఇష్టం. హీరో, విలన్, ఏ పాత్ర అయినా కూడా అద్భుతంగా నటించేస్తారు. ఈ కథ అనుకున్న వెంటనే నాకు ఆది గుర్తుకు వచ్చారు. ఆదిని మ్యాచ్ చేసేందుకు చైతన్య కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం 264 మందిని తీసుకున్నాం. దివ్యా గారు అద్భుతంగా నటించారు. ఈ ప్రాజెక్టుని జ్ఞాన శేఖర్‌తో స్టార్ట్ చేశాం. ఆ తరువాత సురేష్ ఈ ప్రాజెక్ట్‌ని అద్భుతంగా మలిచారు. ప్రొడక్షన్ డిజైనర్ కామేష్, తిరుమలకు థాంక్స్. కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొత్తం అయ్యాక కిరీటం పెట్టినట్టుగా.. శక్తి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు. ఆగస్ట్ 7 నుంచి ‘మయసభ’ అందరి ముందుకు రానుంది. ‘మయసభ’ అందరి ఆస్తిలా మారిపోతోంది’ అని అన్నారు.
