Site icon NTV Telugu

Matka : వరుణ్ తేజ్ మట్కా ఓవర్శీస్ టాక్.. ట్విట్టర్ రివ్యూ.

Makta Rivew

Makta Rivew

కొణిదెల వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వరుస ప్లాప్స్ నుండి గట్టెక్కి హిట్ బాట పట్టిస్తుందని ఆశగా ఉన్నాడు వరుణ తేజ్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

Also Read : VenkyAnil3 : వెంకీ మామ కోసం రంగంలోకి ‘రమణ గోగుల’

కాగా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ ముగిసాయి. అందుతున్న సమాచరం ప్రకారం ఫస్ట్ హాఫ్ వరుణ్ తెజ్ కెరీర్ లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిన సినిమాగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. నాలుగు విభిన్న వయస్కుడిగా వరుణ్ తేజ్ అదరగొట్టాడట. అలాగే ఈ సినిమాలో మరొక పాజిటివ్ అంటే సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్. తన నేపధ్య సంగీతం తో సినిమాను చాలా వరకు నిలబెట్టాడట.  సెకండ్ హాఫ్ సినిమాను కాస్త బాగుంటదేమో అని ఎదురు చుసిన ప్రేక్షకుడికి నిరాశ తప్పేలేదట. కరుణ్ కుమార్ రాసుకున్న కథ బాగున్నా, ఆ కథను తెరపై మలచడంలో దర్శకుడు తడబడ్డాడు. పాటలు అసందర్భంగా వస్తూ విసిగిస్తాయి. రొటీన్ గా సాగే కథాంశంతో రెగ్యులర్ ఇంటర్వెల్ తో, ప్రతి సీన్ ప్రేక్షకుడు ఊహించినట్టుగానే జరుగుతు ముగుస్తుందట మట్కా. వరుణ్ తేజ్ చేసిన ప్రయత్నం ఓ మోస్తరు గా ఉందని ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version