Site icon NTV Telugu

Mass Maharaja : రవితేజ సరసన హీరోయిన్ గా సమంత..?

Samantah

Samantah

లవ్‌, ఎమోషన్, త్యాగం దర్శకుడు శివ నిర్వాణ మార్క్. నిన్ను, మజిలీ అలాంటి జానర్ లో వచ్చి సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇలాంటి సినిమాలకు ట్రేడ్‌ మార్క్‌గా శివ నిర్వాణ పేరు ఆ మధ్య కలాంలో మార్మోగింది. కానీ ఆ తర్వాత రూటు మార్చి చేసిన టక్ జగదీశ్, ఖుషి ప్లాప్ అయ్యాయి. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు శివ నిర్వాణ.

Also Read : NBK : బాలయ్యకు తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎస్ CV ఆనంద్ క్షమాపణలు

మాస్ మహారాజతో ఫుల్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ జానర్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. శివ చెప్పిన పాయింట్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచేసాడు రవితేజ. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక సూపర్ న్యూస్ టాలీవుడ్ సిర్కిల్స్ లో హల్ చల్ చేస్తుంది. శివ నిర్వాణ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా సమంతను ఫిక్స్ చేసారని టాక్. శివ డైరెక్ట్ చేసిన మజిలీ, ఖుషి సినిమాలలో హీరోయిన్ గా నటించింది సమంత. ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా శివ అడగగానే ఒప్పుకుందట సామ్. ఇటీవల కాలంలో సమంత తెలుగులో పూర్తిగా సినిమాలు తగ్గించేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే లేడి ఓరియెంటెడ్ సినిమా మాత్రేమే చేస్తుంది. ఇక ఇప్పడు శివ డైరెక్షన్ చేస్తున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. మైత్రీ మూవీస్ నిర్మాణంలో వస్తున్న ఈసినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ ప్రకటన రానుంది.

Exit mobile version