NTV Telugu Site icon

Karthik Raju: ‘అధర్వ’కు దన్నుగా మాస్ మహరాజా!

Atharva

Atharva

 

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అధర్వ’. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ను మాస్ మహరాజా రవితేజ విడుదల చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్’ అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్‌ కు హైలైట్ అని చెప్పాలి. శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం దీనికి మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది.

‘ది సీకర్ ఆఫ్ ది ట్రూత్’ అనే ట్యాగ్ లైన్ తో ‘అధర్వ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా ‘డీజే టిల్లు, మేజర్’ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల దీనికి బాణీలు కట్టడం విశేషం. ఈ మూవీకి చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ‘అధర్వ’లో ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

 

Show comments