మాస్ మహారాజ రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర.
Also Read : SVC : దిల్ రాజు.. పవన్ కళ్యాణ్.. వంశీ పైడిపల్లి సినిమా ఫిక్స్..
ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేసేందుకు ఈవెంట్ నిర్వహించాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈవెంట్ క్యాన్సిల్ చేసారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ మంగళవారం అనగా 28న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు తమిళ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిధిగా రాబోతున్నారు. హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో సాయంత్రం 5.30 గంటలకు మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సూర్య చీఫ్ గెస్ట్ గా రాబోతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా భారీగా తరలివచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్ లోనే మాస్ జాతర ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. అనేక వాయిదాలు అనంతరం ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అయితే అదే రోజు రాజమౌళి , ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహబలి ఎపిక్ రిలీజ్ కానున్న నేపథ్యంలో 31 సాయంత్రం ప్రీమియర్స్ ప్రదర్శించి నవంబరు 1 నుండి రెగ్యులర్ షోస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
