NTV Telugu Site icon

“ఎటర్నల్స్” టీజర్… ఆసక్తికరంగా మార్వెల్ సూపర్ హీరో మూవీ

Marvel Studios’ Eternals Teaser Released

మార్వెల్ స్టూడియోస్ ‘ఎటర్నల్స్’ అనే మరో సూపర్ హీరో మూవీ టీజర్‌ ను విడుదల చేసింది. ఇది కొత్త సూపర్ హీరోల చిత్రం. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వం వహించారు. సల్మా హాయక్, ఏంజెలీనా జోలీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటులు రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ లతో పాటు పాకిస్తాన్ నటుడు కుమాయిల్ నంజియాని కూడా నటించారు. ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. తాజాగా విడుదలైన “ఎటర్నల్స్” టీజర్ సల్మా హాయక్ వాయిస్ఓవర్ తో “మేము చూశాము… మార్గనిర్దేశం చేసాము. మేము వారి పురోగతికి సహాయం చేసాము. వారు అద్భుతాలు సాధించారు. కొన్ని సంవత్సరాలుగా… కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము జోక్యం చేసుకోలేదు” అనే డైలాగ్ తో ఉన్న టీజర్ ఆకట్టుకుంటోంది. మహాసముద్రం దగ్గర నిరాశలో ఉన్న ప్రజల దగ్గరకు ఒక అంతరిక్ష నౌక చేరుకుంటుంది. అందులో ఉన్న సూపర్ హీరోలు అక్కడి ప్రజలు వ్యవసాయం చేసుకోవడానికి తగిన పరిస్థితులు కల్పిస్తారు. దీనితో వారిలో కొత్త ఆశ చిగురిస్తుంది. కానీ చివర్లో ఏదో విధ్వంసం జరిగినట్లుగా చూపించారు. మరి అదేంటో ? ఎవరు చేశారు ? అనేది ఆసక్తికరంగా ఉంది. ఇక టీజర్‌లో ఇండియన్ టచ్ ఉండడం మరో విశేషం. ఈ టీజర్ మార్వెల్ ప్రమాణాలతో సూపర్ హీరో చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

Marvel Studios’ Eternals | Official Teaser