మలయాళ సినీ పరిశ్రమలో కొత్త చరిత్ర రాసిన సినిమా ‘మంజుమ్మెల్ బాయ్స్’. వసూళ్ళ పరంగా భారీ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు అవార్డుల వేదికపైన దూసుకెళ్లింది. ఇటీవల ప్రకటించిన 55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ మొత్తం 10 అవార్డులు గెలుచుకొని దుమ్మురేపింది. రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మ యుగం’ లో తన అద్భుత నటనతో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడి అవార్డు దక్కించుకోగా, ‘మంజుమ్మెల్ బాయ్స్’ మాత్రం ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో విజయం సాధించింది. అవార్డులను సోమవారం (నవంబర్ 3) త్రిస్సూర్‌లో సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెరియన్ ప్రకటించారు.
ఈ అవార్డుల జ్యూరీకి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అధ్యక్షత వహించగా, దర్శకుడు రంజన్ ప్రమోద్, నిర్మాత జిబు జాకబ్, గాయని గాయత్రి అశోకన్, సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ వంటి సినీ ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 128 సినిమాలు పోటీలో పాల్గొనగా, వాటిలో 38 చిత్రాలు ఫైనల్ రౌండ్‌కి ఎంపికయ్యాయి.
మలయాళ సినీ రంగం టాప్ 5 అవార్డులు:
1. ఉత్తమ చిత్రం – మంజుమ్మెల్ బాయ్స్
2. ఉత్తమ నటుడు – మమ్ముట్టి (బ్రహ్మయుగం)
3. ఉత్తమ నటి – శామల హంజా (ఫెమినిచి ఫాతిమా)
4. ఉత్తమ దర్శకుడు – చిదంబరం (మంజుమ్మెల్ బాయ్స్)
5. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం – ప్రేమలు
మంజుమ్మెల్ బాయ్స్ గెలుచుకున్న 10 అవార్డులు:
– ఉత్తమ చిత్రం
– ఉత్తమ దర్శకుడు – చిదంబరం
– ఉత్తమ సినిమాటోగ్రఫీ – షైజు ఖలీద్
– ఉత్తమ కళా దర్శకత్వం – అజయన్ చలిసేరి
– ఉత్తమ గేయరచయిత – వేదన్ (కుతంత్రం)
– ఉత్తమ సౌండ్ మిక్సింగ్
– ఉత్తమ కలరిస్ట్ – శ్రీక్ వారియర్
– ఉత్తమ క్యారెక్టర్ నటుడు – సౌబిన్ షాహిర్
– ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– ఉత్తమ ఎడిటింగ్
మొత్తం మీద, ‘మంజుమ్మెల్ బాయ్స్’ వసూళ్లలోనూ, అవార్డుల పరంగానూ సూపర్ హిట్‌గా నిలిచి, మలయాళ సినీ పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలు సృష్టించింది.
